కరోనా తెలుగు హీరోల మైండ్ సెట్ ను పూర్తిగా మార్చేసింది... గ్యాప్ వస్తే గానీ, వేగం తాలూకు ప్రాముఖ్యత తెలియలేదు మన హీరోలకు. సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తే కెరీర్ లో హీరోగా ముప్పై సినిమాలు కూడా చేయడం కష్టం, పైగా కరోనా లాంటి వైరస్ లు వస్తే.. ఇక పది సినిమాలు కూడా హీరోగా చేయలేం అని అర్ధం చేసుకున్నారు.అందుకే ఎలాగైనా రూట్ మార్చాలి, వేగం పెంచాలి అని మన యంగ్ హీరోలు ఫీల్ అవుతున్నారట.