65ఏళ్ల వయసులో చిరంజీవి ఆచార్య సినిమాకోసం బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన లిరికల్ సాంగ్ టీజర్, చిరంజీవి స్టెప్పులు.. సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. కొరటాల శివ దర్శకుడు కాబట్టి.. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. రామ్ చరణ్ గెస్ట్ అప్పిరయెన్స్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణ. కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు మినహా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్న దశలో, కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సినిమాకోసం చిరంజీవి పడిన కష్టాన్ని తెరపై చూడాలంటే మరిన్ని రోజులు మెగా అభిమానులు వేచి చూడక తప్పదు.