కొన్ని గ్రామాలలో అంత్యక్రియలకు ఇబ్బందిగా మారడంతో, ఒకేసారి క్రేన్స్ తో గుంతలు తవ్వి మరీ కుప్పలు కుప్పలుగా శవాలను పూడ్చి పెడుతున్నారు. చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా, ఎవరూ చూడని రీతిలో స్మశాన వాటికలకు డెడ్ బాడీ లు కూడా క్యూ కట్టడం అందరిని కలచివేస్తోంది. ఇక ఇప్పటి వరకు కేవలం సినిమా థియేటర్ లకు మాత్రమే హౌస్ఫుల్ బోర్డ్ లను చూసాము.. కానీ ఇప్పుడు ఏకంగా స్మశాన వాటికల్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు తగిలిస్తున్నట్లు సమాచారం..