పిల్లలిద్దరిని తాను ఎలా చూసుకుంటాను అనే విషయం పై నమ్రత స్పందించింది. పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తానని,వారి ఇష్టాఇష్టాలను గౌరవిస్తూ వారికి మంచి చెడు లాంటి విషయాలను చెబుతూ ఉంటాను అని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఏ పిల్లలూ అదేపనిగా చదవటానికి ఇష్టపడరని,అందుకే తన పిల్లల్ని చదివేటప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని తెలిపింది. అంతేకాకుండా వీలైనంతవరకూ నిరాడంబరంగా ఉండమని చెబుతూ ఉంటుందట నమ్రత.