పవన్ కళ్యాణ్ నటించబోతున్న "అయ్యప్పయుమ్ కోషియమ్ " రీమేక్ కోసం సాయి పల్లవిని ముందుగా అడగగా, ఆ సినిమా కోసం ఏకంగా తను రూ. 3 కోట్ల ను డిమాండ్ చేసిందని టాక్. అందుకే అంత ఇచ్చుకోలేక నిర్మాతలు నిత్యా మీనన్ తో ముందుకు వెళ్తున్నారు.అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని , ఆ సినిమాలో తన పాత్రను కొంచెం పెంచమని దర్శకనిర్మాతలను అడగగా, దానికి ఆ దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదు. అందుకే తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి అయ్యప్పయుమ్ కోషియమ్ సినిమా , హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. ఏదో హీరోయిన్ ఉండాలంటే ఉండాలి అంతే..! కానీ హీరోయిన్ పాత్రకు ఈ కథలో పెద్దగా స్కోప్ లేదు. అలాంటప్పుడు మూడు కోట్ల రూపాయలను సాయిపల్లవికి ఇచ్చి ఎంచుకోవడం ఎందుకు అని నిర్మాతలు భావించారు.