సుప్రీత తన తల్లి సురేఖవాణి తో కలిసి చేసే టిక్ టాక్ వీడియో లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సుప్రీత తన ఫోకస్ అంతా ఇంస్టాగ్రామ్ మీద పెట్టినట్టు కనిపిస్తున్నారు. అలా నిన్న లైవ్ లోకి వచ్చిన సుప్రీతను , తన నూతన ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.ఒక నెటిజన్ మాత్రం మీరు ఉదయాన్నే లేవగానే ఫోన్ లో ఏ యాప్ వాడతారు? అని అడగగా, దానికి సమాధానంగా సుప్రీత ఓ పెద్ద లిస్ట్ చెప్పారు. ముందుగా స్నాప్ చాట్ చేస్తాను, ఆ తర్వాత వాట్సాప్,ఇంస్టాగ్రామ్ లు చూస్తాను. ఎవరైనా ఫోన్ చేసినా, అంతగా రెస్పాండ్ అవ్వను. ఫోన్ కాల్స్ ను పెద్దగా పట్టించుకోను అని తన అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు సుప్రీత..