తనదైన శైలిలో మదర్స్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశాడు వర్మ. ఈ వీడియోలో కొందరు తల్లులు, తమ పిల్లలను కొడుతుండడం మనం గమనించవచ్చు. దీని పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.. "మిమ్మల్ని కూడా మీ అమ్మ ఇలానే కొట్టిందా సార్"అని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరేమో "రాము ఏం చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుందని" మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. కానీ మదర్స్ డే సందర్భంగా ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.