చిత్ర పరిశ్రమకి చాలా హీరోయిన్స్ పరిచయం అవుతుంటారు. అందులో కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. ఆలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ కొన్ని సంవత్సరాల తరవాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఒక 20 ఏళ్ళ క్రితం, హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మాయి, తర్వాత వదిన, అత్త పాత్రలు కూడా పోషించి, ఆ తర్వాత అమ్మమ్మ, నానమ్మ క్యారెక్టర్లు కూడా చేసి రిటైర్ అయ్యేవారు.