తెలుగు పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఆయన వర్షం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా మారాడు.