పదిహేను సంవత్సరాల వయసులోనే మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబీ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడింది ఈ పాట ప్రజలకు బాగా చేరువయ్యింది ఆ తరువాత తెలుగు కన్నడ మలయాళం భాషలలో సుమారు 3000 పైగా సినిమాలలో పాటలు పాడింది. 1994లో ఈమెకు 15 సంవత్సరాలు ఉన్న సమయంలో లలిత సంగీత విభాగంలో ఆల్ ఇండియా రేడియో నుండి నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.