జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని అప్పట్లోనే 9 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాకి అశ్వినీదత్ ప్రొడ్యూసర్ గా నిర్వహిస్తుండడంతో ఎంతో అనుభవజ్ఞులైన దర్శకులు, నిర్మాతలు ఆయనకి ఫోన్ చేసి హెచ్చరించారట. కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా వెనుకడుగు వేయలేదు. ధైర్యం చేసి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ సినిమాకి విడుదల ముందు నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి .అప్పట్లో డిజిటల్ సిస్టం లేదు కాబట్టి ప్రింట్ రవాణా అవ్వాల్సిందే..విడుదల రోజున షోలు లేట్ అయ్యాయి.