సునీత పెళ్లి ఫోటోలు ,వీడియోలు ,మాల్దీవ్స్ ఫోటోల కింద అన్నీ ఇలాంటి కామెంట్సే ఉండడం చర్చనీయాంశంగా మారింది. కానీ సునీత గొప్పగా ఆలోచించి, ఈ కామెంట్స్ ను కానీ, ఈ కామెంట్ చేసిన వాళ్లని కానీ ఏమాత్రం లెక్క చేయలేదు.. అయితే నిన్న ఉమెన్స్ డే సందర్భంగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ మాత్రం కామెంట్స్ చేసిన వాళ్లందరికీ చెంప చెల్లుమనేలా ఉన్నాయి.. "నా బాధను ఎవరూ పట్టించుకోలేదు. నా కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు. పైగా నన్ను ఎగతాళి చేశారు.తక్కువచేసి మాట్లాడారు. అలాంటిది మీరా నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. అయినా మీ విషెస్ నేను తీసుకుంటాను. ఎందుకంటే అవే నాకు స్ఫూర్తి" అని అర్థం వచ్చేలా సునీత ఇంగ్లీష్ లో పెట్టిన పోస్ట్ నెటిజన్ల మెప్పు పొందింది. ముఖ్యంగా ఆమె ఫాలోవర్స్ అందరు సునీత ఇచ్చిన సమాధానానికి ఫిదా అవుతున్నారు.