ఆదా శర్మ చిన్న వయసులోనే 2008లో హిందీ హారర్ సినిమా" 1920 " సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమా మంచి హిట్ ని పొందడంతో, ఈమె నటనకు ప్రేక్షకుల తోపాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా ఈమెకు ఫిలింఫేర్ ఉత్తమ ఫిమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత 2014లో హిందీ లోనే హసే తో ఫసే చిత్రంలో నటించింది.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక తర్వాత ఈమెను తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఆహ్వానించింది. అలా ఏకంగా తెలుగులో ఐదు సినిమాలు చేసింది...