పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడు, శృతిహాసన్ కథానాయికగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రానికి బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని 2012 మే 11న అట్టహాసంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ ,ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ సంచలనాత్మక విజయం సాధించిన "దబాంగ్" సినిమా నుంచి రీమేక్ చేసి తెలుగులో గబ్బర్ సింగ్ గా అనువదించారు. ఇక విడుదలైన మొదటి షో తోనే మంచి హిట్ టాక్ ను అందుకొని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.. ఇక ఈ చిత్రం దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది. ఈ చిత్రం ద్వారా ఉత్తమనటుడిగా పవన్ కళ్యాణ్ ఉత్తమ నటిగా శృతిహాసన్ కూడా ఎంపికయ్యారు.