సాయి ధరమ్ తేజ్ సరికొత్తగా కరోనాపై స్పందించారు.. ప్రస్తుత కాలంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆదేశాలను అమలు చేయాలని, తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని కూడా సూచించారు. ఈ కరోనా సమయంలో ఈ భూమిమీద అత్యంత సేఫ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే, అది కేవలం మన ఇల్లు మాత్రమే అంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో ఉంటూ కూడా మాస్కులు, శానిటైజర్ లు ఉపయోగించాలని కూడా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.