ఒకే ఫ్యామిలీనుంచి వరుసబెట్టి హీరోలు వస్తే.. జనాలు ఎరిని ఆదరిస్తారు. పోనీ అన్నదమ్ములే అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఎవరిని సక్సెస్ వరిస్తుంది. దాదాపుగా తెలుగు ఇండస్ట్రీలో వారసులుగా అడుగు పెట్టిన అన్నదమ్ములిద్దరూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. హీరోలుగా మారిన అన్నాదమ్ముల్లో ఎవరో ఒకరే బాగా సక్సెస్ అవుతున్నారు. రెండోవారు పూర్తిగా తెరమరుగైపోయిన సందర్భాలున్నాయి, లేదా సినిమాలతోనే కాలక్షేపం చేస్తున్న ఉదాహరణలూ ఉన్నాయి.