ఇండియా వరకు చూసుకుంటే సల్మాన్ ఖాన్ 'రాధె' సినిమా పేరుకే థియేటర్లలో రిలీజవుతోంది. దాదాపుగా ఎక్కడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చు. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను 'జీ'లో లేదా డీటీహెచ్ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసుకోవాల్సిందే. మరి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డపుడు థియేట్రికల్ రిలీజ్ ఎందుకు అనే సందేహం రావచ్చు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ల మీద ఫోకస్తోనే సల్మాన్ ఖాన్ ఈ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు..