కరోనా సెకండ్ వేవ్ కారణంగా వెండితెర వినోదాలకు మరోమారు కళ్లెం పడింది.దీంతో ఓటీటీ వేదికల వైపు సినీ ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు చేసేదేమి లేక ఓటీటీలను ఆశ్రయిస్తున్నాయి.ఇప్పటికే పలు సినిమాలు ఆయా ఓటీటీ సంస్థలతో డీల్ కుదుర్చుకున్నాయి.