రమేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ప్రధానంగా సాహసయాత్ర మూవీ కూడా ఒకటి.. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమాకు మబ్బు చంద్రశేఖర్ రెడ్డి సమర్పణలో నూరా రవీంద్ర రెడ్డి, టీవీఎస్ రెడ్డిలు నిర్మాతలుగా చేయడానికి ముందుకు వచ్చారు..హీరోయిన్స్ గౌతమి, మహాలక్ష్మి, రూపిని లను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి వచ్చారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ అయింది. ఇక అండమాన్లో రమేష్ బాబు, గౌతమి, అలాగే రమేష్ బాబు ,మహాలక్ష్మి ల మీద మొత్తం రెండు పాటలు షూట్ చేశారు..అయితే బాగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అని అనుకున్న నేపథ్యంలోని ఆర్థిక కారణాల వల్ల సినిమా ఆగిపోయింది