నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని తెలిపాడు హీరో రానా తమ్ముడు దగ్గుబాటి భిరామ్, ముఖ్యంగా ప్రేమ, కుటుంబకథా చిత్రాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తేజ దర్శకత్వంలో హీరోగా పరిచయం కావడం మంచి అనుభవం అని అన్నారు అభిరామ్. తేజ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని, అదే సమయంలో భయంగా కూడా ఉందని చెప్పారు. తేజ వర్క్ ఎలా ఉంటుందో.. గతంలో రానా హీరోగా చేసిన నేనే రాజు-నేనే మంత్రి సమయంలో చూశానని అన్నారు అభిరామ్. ఇటీవలే తేజ తనకు కథ చెప్పారని, తన తండ్రి సురేష్ బాబుకి కూడా అది బాగా నచ్చిందని, అదే కథతో తాను హీరోగా ఎంట్రీ ఇస్తున్నానని చెప్పాడు.