సినిమా బండి..ఒక ఆటో డ్రైవర్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వేళ, తన ఆటోలో బ్యాక్ సీట్ లో కెమెరా కనిపిస్తుంది. ఆ ఊర్లో పెళ్లిళ్లకు ఫోటోలు తీసే స్నేహితుడిని కలిసి, మనం ఈ కెమెరాతో సినిమా తీసేద్దాం అని ఆఫర్ చేస్తాడు. ఆ ఊరిలో ఓ తాతయ్య ని పట్టుకొని కథని రాయించేస్తారు. అలాగే గడ్డాలు గీసే బార్బర్ ని హీరోగా చేస్తారు. అలా సినిమాకి కావాల్సినవన్నీ సిద్ధం చేస్తారు. అయితే అక్కడి నుంచి వాళ్ళ తిప్పలు మొదలవుతాయి. చివరికి సినిమా తీశారా?లేదా?అనేది తెరపైనే చూడాలి మరీ.