మొట్టమొదటి సారిగా దేవదాసు చిత్రానికి హీరోగా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇక హీరోయిన్ గా ఇలియానా మొట్టమొదటిసారి ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని, అటు ఇలియానాకు ఇటు రామ్ కు మంచి సినీ కెరియర్ ను అందించింది ఈ సినిమా. అంతేకాకుండా రామ్ కి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. ఇక ఆ తర్వాత తన రెండవ చిత్రం సుకుమార్ దర్శకత్వం వహించిన జగడం. ఈ చిత్రం 2007 మార్చి 16వ తేదీన విడుదలైంది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది..