శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమాను గత నెల 16 వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా ఎక్కువ అవడంతో ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు.ఇక తర్వాత నాగచైతన్య నటిస్తున్న మరో చిత్రం థాంక్యూ. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇటీవల విదేశాలలో ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. అయితే లాక్ డౌన్ తరువాత కొంత పార్ట్ పూర్తి చేసి , ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు హిందీలో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడు చైతన్య.. లడక్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాను ఈ సంవత్సరంలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు..