ప్రారంభంలో మీరు ఏమైనా వివక్షకు గురయ్యారా? అని అడగ్గా..ప్రస్తుతానికి నాకు నటిగా , హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. అయితే హీరోయిన్ అవ్వకముందు కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. బయట హీరోయిన్స్ తో పోలుస్తూ "నువ్వు ఏమంత కలర్ లేవు"అంటూ హేళన చేశారని వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటికీ సమాజంలో వర్ణవివక్ష ఉండడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది" అని పేర్కొంది.