విక్కీ కౌశల్ ఒకే సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండు హిందీ చిత్రాలు రాజీ, సంజు చిత్రాలలో సహాయక పాత్రలతో కౌషల్ 2018 లో నటించి, ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రాముఖ్యతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత అతను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అతని 2018 ప్రాజెక్టులలో నెట్‌ఫ్లిక్స్ చిత్రాలైన లవ్ పర్ స్క్వేర్ ఫుట్, లస్ట్ స్టోరీస్‌లో నటించిన పాత్రలు కూడా ఉన్నాయి. మరుసటి సంవత్సరం, అతను వాణిజ్యపరంగా విజయవంతమైన యాక్షన్ చిత్రం ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లో సైనిక అధికారి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాకి అతను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు .