ప్రభాస్ హీరోగా నాలుగు భారీ చిత్రాలను చేతిలో పెట్టుకొని, ఓకే సమయంలోనే ఒక్కో చిత్రానికి, ఒక్కో మేకోవర్ తో సినిమాలు చేస్తూ, వింటి నుండి బాణం దూసుకెళ్లి నట్టుగా, దూసుకెళ్తున్నాడు.. అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీలైన " రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ " చిత్రాలలో ఒక్కో సినిమాపై ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి.అయితే మరికొద్ది రోజుల్లో ఈ మూడు చిత్రాలు కూడా ఒకే దగ్గర షూటింగ్ జరుపుకోనున్నాయి. ఈ మూడు చిత్రాలలో మొదటి సినిమా అయిన రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మిగిలిన ప్యాచ్ వర్క్, అలాగే రీ షూట్ ను హైదరాబాద్ లోనే కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇక దాని తర్వాత ఆదిపురుష్ యూనిట్ కూడా ఏకంగా 150 రోజుల షూట్ ను ఇక్కడికే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే వరుసలోనే సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ " సలార్ " నెక్ట్స్ షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే వుంది.