హీరో రామ్ కూడా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందే తమిళంలో "అడయాళం" అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించారట. ఈ షార్ట్ ఫిలిం 2002 లో విడుదలైంది. ఇక ఈ షార్ట్ ఫిలిం ద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్.. ఇక ఇందులో నటించిన తీరుకు దర్శకులు కూడా ఫిదా అయ్యారు. అలా మొదటి సారి వైవీయస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాసు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు.