హీరో నాగార్జున తన ఇమేజ్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల వైల్డ్ డాగ్ మూవీలో నాగ్ నటనకు ప్రశంసలు లభించినా, సినిమాకి మంచి టాక్ వచ్చినా.. థియేటర్లలో ఎన్నిరోజులు ఉందో అందరికీ తెలిసిందే. రాంగ్ టైమ్ లో విడుదల చేశామని నాగ్ చెబుతున్నా.. అలాంటి జానర్లు వెబ్ సిరీస్ కే ఎక్కువగా కనెక్ట్ అయ్యే రోజులివి. అయితే తాజాగా మరోసారి నాగ్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ నటిస్తున్న సినిమా కూడా యాక్షన్ మూవీనే.