: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం డిస్కో రాజా. ఈ చిత్రం భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇందులో విలన్ పాత్రలో మెప్పించిన ప్రముఖ తమిళ నటుడు "బాబీ సింహ".రేష్మి మీనన్ అనే హీరోయిన్ ని బాబీ సింహ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరో గా చేసిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే చిత్రంలో, అలాగే తెలుగులో హీరో సాయిరాం శంకర్ నటించిన నేనోరకం అనే చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ రెండు మూవీస్ డిజాస్టర్ కావడంతో రేష్మి గురించి టాలీవుడ్ ఆడియెన్స్ కు పెద్దగా తెలియదు.