ఛార్మి మే 17 1986 న పంజాబ్ లో జన్మించింది. అయితే ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. తన స్వస్థలం ముంబాయిలో అనుకోకుండా ఛార్మిని చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి, ఆమె తల్లిదండ్రులను సంప్రదించి "నీతోడు కావాలి " అనే తెలుగు సినిమాలో నటించే అవకాశం కలుగజేసాడు. అది 2001, అప్పటికి ఛార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆ చిత్రంలో నటించింది. ఇక అయితే ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది. అలా తల్లిదండ్రుల మాట కాదనలేక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఛార్మి కౌర్..