తాజాగా కరోనా బాధితుల కోసం సహాయం అందించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకు వచ్చారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తన దత్తత తీసుకున్న "బుర్రిపాలెం", "సిద్దాపురం"గ్రామ ప్రజలకు ఆయన మరోసారి అండగా నిలిచారు. అక్కడ వైద్య సౌకర్యాలతోపాటు కరోనా వ్యాక్సిన్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంపై అక్కడ అధికారులతో చర్చిస్తున్నాడు.