2015 ఆగస్టు 7న అట్టహాసంగా విడుదలైన చిత్రం శ్రీమంతుడు.. ఇక ఈ చిత్రం విడుదలైన తర్వాత కృష్ణ ఈ సినిమాను చూసి, వెంటనే మహేష్ బాబు ను ఇంటికి పిలిపించారు. ఇక మహేష్ బాబు తో కృష్ణ ఈ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇందులో బాగా నటించావు అంటూ భుజం తట్టాడు. ఇక ఒక్కసారిగా కంట్లో నీళ్లు తిరిగి, ఆ కన్నీళ్లను బయటకు రానివ్వకుండా తనలోనే దాచుకున్నాడు మహేష్ బాబు.. అంటే ఈ సినిమా సక్సెస్ తో తను ఎంత ఎఫర్ట్ పెట్టి సినిమా తీశాడు అర్థమవుతుంది. శ్రీమంతుడు చిత్రానికి గాను 2015లో సైమా అవార్డ్స్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా నంది పురస్కారాలను పొందాడు.. అంతేకాకుండా ఉత్తమ చిత్రంగా మైత్రి మూవీ మేకర్స్ కూడా నంది పురస్కారాలు అందుకుంది . ఇక ఇదే చిత్రానికి 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఐఫా అవార్డును కూడా అందుకున్నాడు..