రాజకీయాల ద్వారా పరాజయం చవిచూసిన కమలహాసన్, ఇప్పుడు తిరిగి మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల "విక్రమ్ " అనే సినిమా చేయడానికి సైన్ కూడా చేసినట్టు సమాచారం.. ఈ చిత్రానికి "మాస్టర్ " దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ప్రధాన ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి ని ఫైనల్ చేశారు. ఇక లోకేష్ కనకరాజు జరిపిన పలు చర్చల అనంతరం సేతుపతి సినిమా ఒప్పుకోవడం జరిగింది.