పూరీ జగన్నాథ్, రవితేజ కాంబోలో తెరకెక్కిన నేనింతే చిత్రం కమర్షియల్ గా హిట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు అందుకుని.. ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. 2009 లో ఈ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా రవితేజ నంది పురిష్కారాన్ని అందుకోగా.. ఉత్తమ డైలాగ్ రైటర్ గా పూరీ జగన్నాథ్ మరో నంది పురిష్కారాన్ని సొంతం చేసుకున్నాడు..