పుణేకు చెందిన రేణుదేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన "బద్రి" సినిమాతో తొలిసారిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమాలో మరోసారి పవన్ పక్కన నటించింది. అప్పటికే పవన్ కు పెళ్లయిన భార్యకు దూరంగా ఉండడంతో పవన్, రేణూదేశాయ్ కలిసి సహజీవనం చేశారు. 2018 లో పవన్ రేణూను వివాహం చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే వీరి కొడుకు అకీరా సమక్షంలో వీరి పెళ్ళి జరగడం విశేషం.. ఈ దంపతులకు అకీరా , ఆద్య అనే ఇద్దరు పిల్లలు వున్నారు. ఇక ఆ కారణం చేతనే తనకు ఆల్రెడీ పెళ్లి అయిన విషయం తెలిసి కూడా ఆమె పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేసి మరీ పెళ్లి చేసుకుంది.