1967లో బాపు-రమణలు దర్శకత్వం వహించిన సాక్షి సినిమా లో కృష్ణ, విజయ నిర్మల హీరోహీరోయిన్లుగా నటించారు.ఆ తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సమయంలో కృష్ణ విజయ నిర్మల తో నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇక పరస్పర అంగీకారంతో మరో రెండేళ్లకు అంటే 1969లో వీరి వివాహం జరిగింది. ఇక అప్పటికే వివాహితులైన కృష్ణకు, విజయనిర్మలకు ఇది రెండవ పెళ్లి.. ఇక విజయనిర్మల తోడి నటిగా, దర్శకురాలిగా సినీ రంగంలో రాణించింది..