తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత, గౌరవం వేరు. ఈ వంశం నుండి వచ్చిన హీరోలు అందరూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మన అందరి అభిమాన నాయకుడు మరియు కథానాయకుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుండి ఈ వంశం యొక్క సినీ ప్రస్థానం మొదలయింది. ఈయన నటనకు ఆ రోజుల్లో ప్రజలు ఆనందోత్సాహంలో తెలేవారు.