పెళ్లి చూపులు అనే సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన తరుణ్ భాస్కర్.. మొదటి సినిమాతోనే అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు.అంతేకాదు చిన్న సినిమాల పాలిట మిగతా దర్శకులకు భరోసాగా మారాడు ఈ యువ దర్శకుడు. 2016 లో విడుదలైన ఈ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం,ఉత్తమ మాటల రచయితగా గా రెండు జాతీయ పురష్కరాలు లభించాయి.