తెలుగు సినీ పరిశ్రమలో కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా.. సహాయ నటుడిగా.. హాస్యనటుడిగా.. తండ్రిగా, స్నేహితుడిగా ఇలా ప్రతి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ నటుడు చంద్రమోహన్. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న విలక్షణ నటులలో చంద్రమోహన్ ఒకరు. ఈరోజు ఆయన 76వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకున్నారు..