తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగున్నర దశాబ్ధాలకు పైగా దర్శకుడిగా కెరీర్ కొనసాగించిన ఘనత రాఘవేంద్రుడికే చెల్లింది. ఇవాళ మే23న రాఘవేంద్రరావు పుట్టిన రోజు.రాఘవేంద్రరావు, కీరవాణి కలిస్తే సినీగీతాలు అద్భుతంగా వస్తాయన్నది అనేక పర్యాయాలు నిరూపితమైంది. "బొబ్బిలిబ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య" చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు సార్లు నంది అవార్డు అందుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే..