పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ ను డైరెక్టర్ గా బద్రి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. బుజ్జి సినిమా 47 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని, సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది. ఇది కలెక్షన్ల పరంగా మంచి షేర్ ను రాబట్టినప్పటికీ కథ పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడోసారి ఈ సినిమా హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో వేచి చూడాలి మరి..