టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మాస్ మహారాజా రవితేజ కెరీర్ ని నిలబెట్టిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. వీరి కాంబోలో 'ఇడియట్' శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడంతో టాలీవుడ్లో అప్పట్లో వీరి కాంబినేషన్ ఒక ట్రెండ్ సెట్ చేసింది.వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఐదు సినిమాలు వస్తే..అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా.. ఒకటి యావరేజ్.. మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి..