పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ సత్యదేవ్ అనే లాయర్ పాత్ర పోషించారు. ఇందులో ఆయన చెప్పే ప్రతి డైలాగ్ థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. అయితే ఈ సినిమాలోని కోర్టు సన్నివేశాల్లో వచ్చే పవన్ సంభాషణలన్నీ చాలా పెద్దగా ఉంటాయి. ఈ డైలాగ్స్‌పై 'వకీల్‌సాబ్'లో నటించిన శివకుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.