ఆర్.నారాయణమూర్తి ముత్యాల సుబ్బయ్య తో కలిసి ఎర్రోడు చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమాలో నారాయణమూర్తి పై డ్యుయట్లు పెట్టడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది.కానీ ఈ సినిమా వల్ల నిర్మాతకి బాబురావు బాగా లాభపడ్డారు. సినిమాను మంచి రేట్ కి అమ్మారు. కానీ నారాయణమూర్తి పై నమ్మకంతో కొంతమంది బయ్యర్లు సినిమాను ఎక్కువ పెట్టి కొన్నారు. దానితో వాళ్లంతా భారీ నష్టపోయారు. నష్టాల వల్ల నారాయణ మూర్తి తన సొంత సినిమాలను తక్కువ రేట్లకే అమ్మవలసి వచ్చింది. అందువల్లనే ఆయన మంచితనమే ఆయనకు శాపంగా మారిందని సినీ ప్రజలు చెప్పుకుంటున్నారు.