కళ్యాణ్ రామ్ కి కూడా తన తమ్ముడు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అంతలా వీరిద్దరూ కలిసి మెలిసి రామలక్ష్మణుల వలే జీవిస్తున్నారు కూడా.. అయితే వీరిద్దరూ ఇలా ఉండడానికి గల కారణం , వారి భార్యలు కూడా ఒక కారణం అని ఈ ఫోటోలు చూస్తే చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.. కళ్యాణ్ రామ్ సతీమణి స్వాతి ఇరువురు ఓ ఫోటోలో కనిపిస్తున్నారు. వీరిద్దరూ ఇలా కలిసి ఉండటం చూసి అభిమానులు చాలా సంబర పడిపోతున్నారు. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు లాగే ఉన్నారని నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఫోటో తెగ వైరల్ గా మారింది.