వెండితెర సామ్రాజ్ఞి గా పేరు తెచ్చుకున్న మహానటి సావిత్రి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. నిజజీవితంలో కూడా అడిగినవారికి లేదనకుండా సహాయం చేస్తూ అందరి మన్ననలను పొందింది.తెలుగులోనే కాదు తమిళ్ సినిమాలలో కూడా నటించి, తనదైన ముద్ర వేసుకొని "నడిగర్ తిలగం" అనే బిరుదును కూడా పొందింది . ఆ తర్వాత తమిళ నటుడు జెమినీ గణేషన్ మంచితనాన్ని చూసి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ జెమినీ గణేషన్ కి అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. తర్వాత సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. ఇక జెమినీ గణేషన్ మరొక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె జీర్ణించుకోలేక పోయింది. అంతేకాకుండా జెమినీ గణేషన్ ఆమె ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయాడు. ఇలా వీరిద్దరి మధ్య కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో తాగుడుకు బానిస అయ్యి, అప్పటి వరకూ బాగా బతికిన ఈమె, చివరి దశలో నిరుపేద రాలిగా జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం పాటు కోమాలో ఉండి, 46 సంవత్సరాల వయసులో డిసెంబర్ -26 -1981 చెన్నైలో మరణించింది.