అతి చిన్న వయసులోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష ను ముగ్గురు ప్రముఖ రాజకీయ నాయకుల కుమారులు ఈమెను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపారట. కానీ ఈమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఎంతలా అంటే ప్రత్యూష డెడ్ బాడీ ని పోస్టుమార్టం చేసిన డాక్టరు, రేప్ కేసుగా తేల్చి చెప్పడంతో ఆయనను కూడా సస్పెండ్ చేశారు. అంటే ఒక డాక్టర్ ను సస్పెండ్ చేశారు అంటే అవతల ఎంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారో చెప్పకనే తెలుస్తోంది.. కానీ ప్రత్యూష తన చిన్ననాటి స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని ప్రేమించిందని, ఇక వారి వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో 2002 ఫిబ్రవరి 23న కోకోకోలలో విషం కలుపుకొని ఇద్దరు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అని సాక్ష్యాలు కూడా సృష్టించారు. ఇవన్నీ ప్రత్యూష తల్లి కొట్టిపారేసింది. ప్రత్యూష మరణం వెనుక ఉన్న కారణం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.