వరుడు సినిమా..30 కోట్లకు పైగా ఖర్చు చేసి తీసిన ఈ చిత్రాన్ని, అభిషేక్ నామా అంతకంటే ఎక్కువ ధరకు తీసుకొని విడుదల చేశారు. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. బన్నీ కెరియర్ లో ఇలాంటి చిత్రం మరొకటి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రం ద్వారా 80 శాతం నష్టపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా వెల్లడించారు. కానీ టాలీవుడ్ హీరోలలో ముఖ్యంగా మహేష్ బాబు మాత్రమే కొన్ని సినిమాలు లాస్ వస్తే, పిలిచి మరీ డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఇప్పటివరకు ఎవరూ అలా చేయలేదు. మహేష్ బాబు తన సొంత సినిమా కాకపోయినప్పటికీ , నష్టం వస్తే డబ్బు వెనక్కి ఇవ్వడమే కాకుండా తరువాత సినిమాలు కూడా ఇప్పించేవారు. ఇక మహేష్ బాబు ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు అంతేకాకుండా చాలా మంది హీరోలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు హెల్ప్ చేయాలని కూడా ఆయన కోరారు.