పవన్ కళ్యాణ్ కి వ్యవసాయం అంటే ఇష్టమట .అందుకే కేవలం 250 గజాలు ఉన్న తన భూమిలో ఆదాయం ఇచ్చే విధంగా చేయడమే లక్ష్యంగా ఈ సాగు ప్రక్రియ ఉంటుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ప్రముఖ ప్రకృతి వైద్యులు శ్రీ విజయ రామ్ గారి సలహా తో తన వ్యవసాయ క్షేత్రంలో, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా , యువతకు , రైతులకు ప్రకృతి వ్యవసాయాన్ని అందిచే చిన్నపాటి భూమిలో సాగు చేయడం గురించి తెలియజేస్తాము. అంటే 250 గజాల భూమిలో 81 మొక్కలు నాటి సాగు చేయడం ద్వారా ఏ విధంగా ఫలసాయం పొందవచ్చు, అనే విషయాలను తెలియజేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు..