పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేయాలి ,న్యాయం చేకూర్చాలని తపనతోనే అప్పట్లో బాగా తపనపడే వారట. ఇక ఎక్కడ నక్సలిజం లోకి వెళ్ళిపోతాడో ఏమో అన్న భయంతో చిరంజీవి రివాల్వర్ కూడా ఇప్పించారు.త్రివిక్రమ్, డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన చిత్రం జల్సా. ఈ చిత్రాన్ని 2008 లో విడుదల చేశారు. ఇక ఆ సినిమాలో నక్సలిజం పాత్రలో నటించి, అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్ర వేయడానికి గల కారణం ఏంటంటే.. సమాజంలో చోటు చేసుకున్న అవినీతి , అన్యాయాలను ఎదిరించాలనే తపన తనకు చిన్నప్పటి నుంచి ఉండేదని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తుంటారు. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే తొలుత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు